ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్..

272
britan
- Advertisement -

కరోనా వైరస్ బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌…నిన్న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వ్యాధి తీవ్రత పెరగడంతో డాక్టర్లు ఐసీయూకి తరిలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

వారం రోజుల క్రితం బోరిస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా లక్షణాలు ఇంకా కనిపిస్తుండటంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇక ఇవాళ వ్యాధి తీవ్రత పెరగడంతో ఐసీయూకి తరలించారు.

నిర్బందాన్ని తానే స్వయంగా పదిరోజులు పొడగించుకున్నట్లు వీడియో ద్వారా తెలిపారు బోరిస్. నాలో ఇంకా స్వల్పంగా వైరస్ లక్షణాలున్నాయి…శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు..ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాను కరోనా లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు స్వీయ నిర్బంధంలో ఉంటానని ఆస్పత్రిలో చేరేకంటే ముందు వీడియోలో తెలిపారు.

- Advertisement -