అమీర్‌పేటలో మాంగళ్య షాపింగ్‌ మాల్..

118
gopinath

హైదరాబాద్ అమీర్ పేటలో మాంగళ్య షాపింగ్ మాల్ ని ప్రారంభించారు టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా మాంగళ్య యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు కవిత. ప్రజలకు క్వాలిటీ వస్త్రాలను తక్కువ ధరలకు అమ్మడం మంచి విషయం అన్నారు. కోవిడ్ సమయంలోనూ ఇంత పెద్దఎత్తున ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటే మాంగళ్య పట్ల ఉన్న ఆదరణ అర్ధమవుతుందని…మంగళ్య షాపింగ్ మాల్ కస్టమర్లకు మరింత దగ్గర అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.