రాష్ట్రపతి రామ్‌నాథ్‌ బర్త్‌ డే…సీఎం కేసీఆర్ విషెస్

105
cm kcr

రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ 75వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ విషెస్ తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు.

రాష్ట్రపత్తి రామ్‌నాథ్‌ కోవింద్‌ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విధాన నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు గొప్ప అంతర్దృష్టి ఉందని, జాతికి రాష్ట్రపతి కోవింద్‌ గొప్ప ఆస్తి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంకితభావంతో ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని తెలిపారు.