ఖమ్మంలో ఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు..

290
- Advertisement -

ఖమ్మం జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆద్వర్యంలో ఈ వేడుకను గులాబీ శ్రేనులు భారీ ఎత్తున జరిపారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాళేశ్వరం మన జీవన ధార. అతి చిన్న, కొత్త రాష్ట్రం తెలంగాణ మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి చరిత్ర సృష్టించింది.

Kaleswaram inauguration celebrations

కేసీఆర్ తెలంగాణ జాతిపిత అవడం మన అధృష్టం. రైతులంత సంతోషంలో ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేయడం కేసీఆర్ ఘనత అని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

మరోవైపు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో సింగరేణి కార్మికులు భారీగా పాల్గొన్నారు. వేడుకకు వచ్చిన కార్మికులకు స్వీట్ల పంపిణి చేశారు.

- Advertisement -