- Advertisement -
సీఎం కేసీఆర్ పట్టుదలతో ఎస్పారెస్పీకి పునర్ వైభవం వచ్చిందని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రగతినగర్,అర్వపల్లి,తిమ్మాపురంలో ఎమ్మెల్యేగా గాదరి కిషోర్‌తో కలిసి ఎస్పారెస్పీ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి..కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం కాబోతుందని తెలిపారు.
ఎస్సారెస్పీ కాలువ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి తూముల ద్వారా రైతుల పొలాల్లోకి నీరు చేరుకోనుంది. ఎస్పారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్ధానికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.
- Advertisement -