నారాయణరావుపేటకు కాళేశ్వరం నీళ్లు:హరీష్‌

388
harish rao
- Advertisement -

నారాయణరావు పేట మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటైన నారాయణరావు పేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన హరీష్ … నారాయణ రావుపేట మండలం 30 ఏండ్ల కళ.. ఆ కళ కేసీఆర్ ఆశిస్సులతో ఫలించిందన్నారు.

నేటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నుండే ప్రారంభం అవుతాయన్నారు. తెలంగాణ పోరాటం ఎలా జరిగిందో ఈ మండల పోరాటం అలాగే జరిగిందన్నారు. ఈ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని తెలిపిన హరీష్‌ కాళేశ్వరం నీళ్లతో ఈ మండలానికి ఐదు వేల ఎకరాలకు నీరిస్తామన్నారు.

కాలం కాక రైతులు ఆందోళన లో ఉన్నారు, ముఖం మొగులు కేసి చూస్తున్నారు.. గోదావరి నీళ్లొస్తే కాలం తో పనిలేక రెండు పంటలు పండుతాయన్నారు. రైతులు ఆరుతడి పంటలు పండించి అధిక ఆదాయం పొందాలన్నారు. వ్యవసాయం అనేది బట్టకు పొట్టకే కాదు ఉన్నతమైన జీవితానికి ఉపయోగపడేలా పండించాలన్నారు. ఈ మండలం లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపిన హరీష్‌… స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన వారికి పాస్ బుక్స్ పంపిణీ చేయాలన్నారు.

ఈ మండలాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా చేసుకోవాలన్నారు. మండల కేంద్రానికి మెరుగైన బస్ సౌకర్యం కల్పిస్తానని తెలిపిన హరీష్‌.. ఈ మండలం ఆకుపచ్చని చెట్లతో అలరారలన్నారు. ప్రతి ఒక్కరు రెండు చెట్లు దత్తత తీసుకొని కాపాడాలన్నారు. తడి, పొడి చెత్త వేరుచేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్యాన్సర్ ను నివరించాలని సూచించిన హరీష్‌…. ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు.

- Advertisement -