బిగ్ బాస్3లోకి ‘ఫిదా’ బ్యూటీ

338
Gayathri Gupta
- Advertisement -

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో త్వరలోనే మూడవ సీజన్ ప్రారంభంకానుంది. బిగ్ బాస్ 3కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. ఇప్పటికే ఈషోకు సంబంధించి ప్రొమోలు కూడా వచ్చాయి. ఇక ఈసారి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు.

బిగ్ బాస్ 3లో పార్టిసిపెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాస్య, గుత్తా జ్వాలా, నందు, హేమచంద్ర వంటి సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. అయితే వారంతా కూడా ఆవార్తలు ఫేక్ అని కొట్టిపారేశారు. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టంట్లలో యాంకర్ శ్రీముఖి ఉంది. తాజాగా ఈలిస్ట్ లో మరో పేరు వినిపిస్తోంది.

ఫిదా సినిమాలో నటించిన గాయత్రి గుప్తా బిగ్ బాస్ 3లోకి వెళ్లెందుకు ఆమె ఒకే చెప్పిందని తెలుస్తుంది. వివాదస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచిన ఆమెను బిగ్ బాస్ 3లో తీసుకురావడం వల్ల ప్లస్ గా మారుతుందని భావించారట బిగ్ బాస్ నిర్వాహకులు.

- Advertisement -