కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలు..ఫోటోలతో

907
kaleshwaram
- Advertisement -

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.

దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం కానుంది. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, భూగర్భం లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణంతో కాళేశ్వరం తెలంగాణ సాగు,తాగు నీటి సమస్యలను తీర్చనుంది.

- Advertisement -