ప్రపంచంలోనే మొదటి స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు ప్రారంభించింది. సౌదీలోని ది లైన్ నగరంలో నియోమ్ స్టేడియం అనే స్కై స్టేడియాన్ని నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది.
ఈ స్టేడియం 2032 నాటికి స్టేడియం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు.
ముఖ్యాంశాలు:
ఖర్చు: $1 బిలియన్ (సుమారు ₹8,300 కోట్లు)
సామర్థ్యం: 46,000 సీట్లు
శక్తి వినియోగం: పూర్తిగా పునరుత్పాదక (renewable) శక్తితో నడుస్తుంది
ప్రారంభం: 2032లో పూర్తయ్యే అవకాశం
వరల్డ్‌కప్ వినియోగం: 2034 ఫిఫా వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు మ్యాచ్‌లను ఆతిథ్యం ఇస్తుంది
ప్రత్యేకత: bird’s-eye view ఆటను వీక్షించగలగడం
ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియంగా ఇది చరిత్ర సృష్టించబోతోంది. 2034 వరల్డ్‌కప్ కోసం నిర్మించబోయే 15 వేదికల్లో ఇది ఒకటి.
Also Read:మీసాల పిల్ల…ట్రెండింగ్ @ 1

