పెళ్లికి ముందే భయపెడుతున్న కాజ‌ల్‌..!

213
Kajal
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్‌ ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రస్తుతం కాజ‌ల్ న‌టిస్తోన్న త‌మిళ్ వెబ్ సిరీస్ లైవ్ టెలీకాస్ట్‌. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. భ‌య‌పెట్టే కండ్ల‌తో సీరియ‌స్ గా కనిపిస్తున్న కాజ‌ల్ స్టిల్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది.

ఈ లుక్ చూడగానే పెళ్లికి ముందే భయపెట్టేస్తున్నావ్ గా! అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. కాజల్ – వైభవ్ – ఆనంది తదితరులు నటిస్తున్న ఈ సిరీస్ అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మ‌రోవైపు కాజ‌ల్ త్వ‌ర‌లోనే ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -