ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం..

74
kkr beat dc

అబుదాబిలో జరిగిన ఐపీఎల్‌ 13లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ దుమ్ములేపింది. కీలక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించింది. కోల్‌కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు డీసీ టీమ్ కుప్పకూలింది. కేకేఆర్ విధించిన 194 లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది ఢిల్లీ. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లోనూ విఫలమయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 మాత్రమే చేసింది. శనివారం ఢిల్లీతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత విజయం సాధించిన కోల్‌కతా ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజ వేసింది.

ఛేదనలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(47:38 బంతుల్లో 5ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ రిషబ్‌ పంత్‌(27) కొంతసేపు క్రీజులో నిలిచినా కోల్‌కతా బౌలర్ల దెబ్బకు మిగతా బ్యా్ట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి(5/20) సంచలన ప్రదర్శనతో ఢిల్లీని కుప్పకూల్చాడు.

అంతకుముందు నితీశ్‌ రాణా(81:53 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌), సునీల్‌ నరైన్‌(64:32 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(9), రాహుల్‌ త్రిపాఠి(13), దినేశ్‌ కార్తీక్‌(3) విఫలమయ్యారు. ఇయాన్‌ మోర్గాన్‌(17:9 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే, రబాడ, స్టాయినీస్‌ తలో రెండు వికెట్లు తీశారు.

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభమాన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మార్కుస్ స్టోయినిస్, షిమ్రోన్ హెట్‌మెయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, తుషార్ దేశ్‌పాండే, అన్రిచ్ నార్జీ