కాజల్ వచ్చేసింది.. బాలయ్య రెడీ !

51
- Advertisement -

కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా NBK 108. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని యూనిట్ అధికారిక ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మొత్తానికి బాలయ్య టీమ్ కాజల్ కి సెట్స్ లోకి ఘనస్వాగతం పలికారు. కాజల్ అగర్వాల్ తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు.

ఇప్పటికే శ్రీలీల లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం బాలయ్య, కాజల్, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ ప్రాజెక్టులో బాలయ్య ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి టీం చాలా పేర్లను పరిశీలించి చివరకు కాజల్ అగర్వాల్ ఫైనల్ చేశారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. పైగా పెళ్లి అయిన లేడీగా కాజల్ నటిస్తోంది. మరి కాజల్ బాలయ్య సినిమాకి ఎంతవరకు న్యాయం చేస్తోందో చూడాలి.

ఇక ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా మూడు గెటప్స్ లో బాలయ్య లుక్ ఉంటుంది. ఐతే, అరవై ఏళ్ల వ్యక్తిగా ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ అరవై ఏళ్ల వ్యక్తి లుక్ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. అలాగే మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కూడా బాలయ్య నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -