భల్లాలదేవుడి భార్యనని ఒప్పేసుకుంది..!

195
Kajal as bhallaladeve wife
Kajal as bhallaladeve wife
- Advertisement -

‘బాహుబలి 2’ చిత్రం విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. బాహుబలిలో భల్లాలదేవుడి పాత్రలో రానా నటించారు. బాహుబలిగా నటించిన ప్రభాస్‌కు అనుష్కతో వివాహం జరగడాన్ని బాహుబలి-2లో చూపించగా.. భల్లాలదేవుడికి వివాహం జరిగినట్లు ఎక్కడా చూపించలేదు. అయితే, బహుబలి-1లో మాత్రం భల్లాలదేవుడి కొడుకుగా భద్ర పాత్రలో అడవి శేష్ కనిపించాడు. అనుష్కను విడిపించేందుకు వచ్చిన మహేంద్ర బాహుబలిని వెంటాడుతూ వెళ్లి భద్ర ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని సినిమాలో ఎక్కడా ప్రస్తావించలేదు. భల్లాలదేవుడికి ఎవరితో వివాహం జరిగింది అనే ప్రశ్న కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది.

అయితే రానా సరోగసి విధానంతో ‘భద్ర’ పుట్టాడంటూ బాహుబలి2 ప్రమోషన్లలో సరదాగా బదులిచ్చారు. అయినప్పటికీ అభిమానులను మాత్రం ఆ సమాధానం సంతృప్తి పర్చలేదు. తాజాగా మరోసారి ఆ ప్రశ్న రానాకు ఎదురైంది.. రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ విడుదలైన సందర్భంగా దినేశ్‌ రాజా అనే నెటిజన్‌ రానాని ఓ ప్రశ్న వేశారు. ‘బాహుబలి 2లో మీ భార్య ఎవరు? మీరీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే’ అని రానాకు ట్వీట్‌ చేశాడు. దీనికి రానా.. కాజల్‌ అంటూ సమాధానమిచ్చారు.

kajal

కాజల్‌ అగర్వాల్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం’ అని ట్వీట్‌ చేశారు. వీరిద్దరూ చేసిన ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఒకే ప్రశ్నకు రానా ఎప్పటికప్పుడు సరికొత్తగా సమాధానం చెబుతుండటం గమనార్హం. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాకి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోందన్న సంగతి తెలిసిందే..

- Advertisement -