తాజ్ మహల్‌తో అందాల చందమామ

565
kajal
- Advertisement -

ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలైన ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది అందాల చందమామ కాజల్. ఇప్పటికి వరుస సినిమాలతో ఫుల్ గ్లామర్ డోస్‌తో యూత్‌కి పిచ్చెక్కిస్తున్న కాజల్‌ తాజాగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ని సందర్శించి మైమరిచిపోయింది.

తాజ్ మహల్‌ను చూడటానికి తొలిసారి ఇక్కడకి వచ్చానని సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తాజ్ మహల్ చూసి తనకు నోట మాట రాలేదని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది

నా జీవితంలో ఇప్పటివరకు చాలా సార్లు మనసును ఆకర్షించే తాజ్‌ అందం గురించి విన్నాను…కానీ తొలిసారి తాజ్‌లోని శిల్పకళను స్వయంగా చూశానని …తన మనసులో చెరగని ముద్ర పడిపోయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ప్రస్తుతం కాజల్‌ పారిస్ పారిస్, కాల్ సెంటర్, ముంబయి సెగా, అ! 2,భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -