పెళ్లి సింపుల్‌గానే అంటున్న కాజల్..

333
Kajal-Aggarwal
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను వివాహ‌ం చేసుకోనుంది. అంతేకాదు వీరి పెళ్లి ముహుర్తం కూడా ఫిక్స్‌ చేశారు ఇరు కుటుంబ పెద్దలు. అక్టోబ‌ర్ 30న ముహూర్తం ఫిక్స‌వ‌గా..మ‌హారాష్ట్ర‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ కానీ, లేదంటే క్లాసీ స్టార్ హోట‌ల్ లో కానీ కాజ‌ల్ పెళ్లివేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కాజ‌ల్‌-గౌత‌మ్ సింపుల్ గా వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌నుకుంటున్నార‌ట‌. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎవ‌రినీ రిస్క్ లో పెట్ట‌కూడ‌ద‌ని అనుకున్న ఈ జంట కొద్దిమందినే పెళ్లికి ఆహ్వానించాల‌నుకుంటున్న‌ట్టు సమాచారం. ఇక తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడి సరసన కూర్చొన్న కాజల్ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

- Advertisement -