లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజపై ఎప్పుడూ గౌరవంతో ఉండే కాజల్‌కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు తేజ. రానా హీరోగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రిలో కీ రోల్ ఇచ్చిన తేజ తాజాగా సీతగా కాజల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కు జంటగా లేడి ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ,కాజల్ యాక్టింగ్‌లో ఇరగదీసిందని, ఆమెకు ఇది ‘కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్ట్రా మోడల్ అమ్మాయిగా కాజల్ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
బెల్లకొండ శ్రీనివాస్‌తో కవచం మూవీలో నటించింది కాజల్. వీరిద్దరి జోడికి మంచి మార్కులే పడ్డా సినిమా మాత్రం బాక్సాఫీస్ ముందు బొళ్తాకొట్టింది. దీంతో రెండోసారి వీరి కాంబినేషన్‌తో సినిమాను తెరకెక్కించి మంచి ఫలితాన్నే రాబట్టాడు. మొత్తంగా వయసు మీదపడుతున్న తనలోని నటనలో ఎనర్జీ తగ్గలేదని సీత మూవీ ద్వారా నిరూపించింది కాజల్.