కాజల్ హనీమూన్ ఫోటోలు వైరల్‌..

499
kajal hanimoon
- Advertisement -

అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న గౌతమ్ కిచ్లును తన వాడిగా మార్చుకుంది చందమామ. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారు ఈ జంట. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్ళి తర్వాత మూడు నాలుగు రోజుల పాటు పూజాలు పునస్కారాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. వారం తర్వాత హనీమూన్ కోసం బయటికి వెళ్లిపోయారు. రెడీ టూ గో.. బ్యాగ్స్ ప్యాక్డ్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్. దాంతో అభిమానులు కూడా హ్యాపీ జర్నీ అంటూ వాళ్లను సాగనంపారు.

- Advertisement -