సినిమా కథానాయికలపై పిచ్చి అభిమానం ఉండవచ్చు గానీ.. పిచ్చి మోహం ఉండకూడదు. అలాంటి మోహంతోనే ఒక అభిమాని ఎలాంటి దుస్థితికి చేరాడన్న సంఘటన చెన్నై, రామనాథపురంలో జరిగింది.వివరాలలోకి వెళితే.. తమిళనాడుకి చెందిన ఓ శ్రీమంతుడి కొడుకు కాజల్‌కి వీరాభిమాని. ఆమెని కలవాలని ఫోటో దిగాలని ఎన్నో కలలు కంటుండేవాడు. ఓ రోజు అనుకోకుండా ఇంటర్నెట్‌లో .. మీకు బాగా ఇష్టమైన స్టార్‌తో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామంటూ ఒక ప్రకటన వచ్చింది.
అది చూసిన వ్యక్తి వెంటనే లింక్‌ని క్లిక్ చేసి కాజల్‌ని పరిచయం చేయమని అడిగాడు. దీంతో ఆన్‌లైన్‌లో చాట్ చేస్తున్న వ్యక్తి రూ. 50 లక్షలు ఇస్తే ఆమెని కలిపిస్తానని అన్నాడట. కాజల్‌ని కలిపిస్తానని చెప్పిన సైబర్ నేరగాడు విడతల వారీగా మనీ అడుగుతూనే ఉన్నాడట. దీంతో చెర్రెత్తిన శ్రీమంతుడి కొడుకు ఆయనని గట్టిగా అడిగాడు. దీంతో సైబర్ నేరగాడు తనతో చేసిన ఛాటింగ్ , ఫోన్ కాల్ రికార్డింగ్ బయటపెడతానని అన్నాడట. ఈ పేరుతో మరో 10 లక్షలు గుంజాడట. ఇంతటితో ఆగకుండా ఇంకా పీడిస్తుండడంతో ఆ వ్యక్తి ఇంటి నుండి పారిపోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు తమ కొడుకు కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. కాజల్ అగర్వాల్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాళ్ళ సమాచారం మేరకు ఓ సినీ నిర్మాతను కూడా అరెస్టు చేశారు.