ర‌వితేజ‌తో మ‌రోసారి జోడిక‌ట్ట‌నున్న మిత్ర‌వింద‌..

267
kajal agarval
- Advertisement -

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్ల‌యినా త‌న కెరీర్ ప‌రంగా ఎప్పుడూ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు కాజ‌ల్. టాలీవుడ్ టాప్ హీరోల‌ అంద‌రి స‌ర‌స‌న న‌టించింది. చివ‌ర‌కు చిరంజీవి తో కూడా న‌టించి త‌న డ్రిమ్ ను నెర‌వేర్చుకుంది. చిన్న పెద్ద హీరోల‌ని తేడాలేకుండా అంద‌రితో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప‌లుమార్లు ఐటెం సాంగ్ చేసుకుంటూ బిజిగా గ‌డుపుతుంది కాజ‌ల్. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసుకుంటూ బిజిగా ఉంది. గ‌త కొద్ది రొజులుగా కొంచెం త‌క్కువ సినిమాల్లో న‌టించినా
మ‌ళ్లి టాలీవుడ్ లో మంచి రోజులు రానున్నాయ‌నే తెలుస్తోంది.

ravi teja, kajal
మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ స‌ర‌స‌న మ‌రోసారి న‌టించ‌నుంది కాజ‌ల్. ప్ర‌స్తుతం ర‌వితేజ శ్రీను వైట్ల‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాలో చేస్తున్నాడు. ఆర్వాత ర‌వితేజ తో సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆసినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్ గా త‌న‌ను తీసుకున్నార‌ని కాజ‌ల్ ఓ ఇంట‌ర్యూలో తెలిపింది. ఆ సినిమాలో న‌టించేందుకు తాను సైన్ కూడా చేశాన‌ని తెలిపింది. ఇక మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

kajal
త‌మిళ్ లో విజ‌య్ హీరోగా తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన తెరి మూవీని సంతోష్ శ్రీనివాస్ తెలుగులో తీయ‌నున్నట్లు తెలిపారు కాజ‌ల్. త‌మిళ్ లో స‌మంత చేసిన పాత్ర‌ను కాజ‌ల్ చేయ‌గా…ఎమీ జాక్స‌న్ చేసిన పాత్ర‌లో కేథ‌రిన్ క‌నిపించ‌నుంది. ఈసినిమాతో రవితేజ‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్ రెండోసారి న‌టించ‌నుంది. మొద‌ట‌గా సారోచ్చారు సినిమాలో న‌టించిది. ఇక చాలా రోజుల త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ ఈసినిమా చేస్తున్నాడు.

- Advertisement -