చచ్చినపాము కాటు వేసింది..

228
Texas Man-rattlesnake
- Advertisement -

టెక్సాస్ లో ఓ వ్యక్తిని చచ్చిన పాము మళ్లీ కరిచింది. తన ఇంటి ముందు ఉన్న ఉద్యానవనంలో పనిచేస్తుండగా.. ఓ గిలకపాము తనకి తారసపడింది. భయపడిన ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న చమ్మాస్‎తో(షావల్) ఆ పాము తల నరికాడు. పాము చనిపోయిందని అనుకుని ముట్టుకున్న క్రమంలో రెండు భాగాలుగా అయిన ఆ గిలకపాము తల తిరిగి ఆ వ్యక్తిని కాటు వేసింది.

Texas Man-rattlesnake

నురగలు కక్కుతున్న ఆ వ్యక్తిని ఆయన భార్య జెన్నిఫర్ వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి హుటాహుటినా తరలిచింది. అయితే అప్పటికే అతనికి శరీరం అంతా విషం వ్యాపించడంతో నరకయాతన అనుభవించాడు. ఇక తన భర్త దక్కడేమోనని జెన్నిఫర్ విపరీతంగా ఆందోనళకు గురైంది. విషానికి  విరుగుడుగా ఆ వ్యక్తికి 26 డోసుల మందును ఎక్కించారు. అయితే అదృష్టవశాత్తు మీలో అనే ఆ వ్యక్తి క్రమంగా కోలుకుంటున్నాడు.

Texas Man-rattlesnake

వైద్యం చేసిన బోయర్ అనే వైద్య నిపుణుడు మాట్లాడుతూ.. పాము తల తెగి పడిన తర్వాత కూడా కాటు వేసి విషం చిమ్మగల ప్రభావంతో ఉంటుందని, చనిపోయిందని తొందర పడి ముట్టుకుంటే ఈ రకమైన ప్రమాదాలే జరగవచ్చునని హెచ్చరించాడు. పాము చచ్చినా, బ్రతికినా విషం కలిగి ఉంటే అది చిమ్మకుండా ఉండలేదని అసలు విషయం.

- Advertisement -