ఛోటా కిస్‌పై కాజల్‌ క్లారిటీ..

284
kajal chota
- Advertisement -

కవచం సినిమా ప్రి రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ కాజల్‌కి సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. ఛోటా కిస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కాజల్‌ ఫ్యాన్స్‌ ఛోటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఈ వివాదంపై స్పందించింది కాజల్. ఛోటా తన గాఢ్ ఫాదర్‌ అని ఆయన ముద్దు పెట్టడంలో తప్పేముందన్నారు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్.కెరీర్‌ ప్రారంభంలో చాలా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా ‘కవచం’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో చోటా స్టేజ్ మీద కాజల్ అగర్వాల్‌ని కౌగించుకొని ముద్దు పెట్టేశాడు. కాజల్ లైట్ తీసుకున్నా.. చాలామంది ఛోటా మీద కన్నెర్రజేశారు. అతనిపై సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు. ఛోటా తప్పైపోయింది బాబూ అన్నా శాంతించలేదు.ఈ నేపథ్యంలో కాజల్ ముద్దు వివాదంపై స్పందించింది.

- Advertisement -