కైకాల మృతికి సినీ ప్రముఖుల సంతాపం

31
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మహానటుడు ఎస్వీ రంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన మరణవార్తతో ఇటు టాలీవుడ్‌ లో తీవ్ర విషాదం నెలకొంది.

కైకాల సత్యనారాయణ మృతిపై పలువురు సినీ, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు నటుడు నందమూరి బాలకృష్ణ. కైకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని, ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక జానపద పాత్రలతో తన వైవిద్యమైన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారని బాలకృష్ణ గుర్తు చేశారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణకు స్నేహ సంబంధాలు ఉన్నాయని, నాన్న గారితో ఎన్నో సినిమాలు చేశారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. సినిమాల్లోనే కాకుండా అటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని, పార్లమెంట్‌ సభ్యునిగా ప్రజలకు సేవలందించారని బాలకృష్ణ కైకాల సేవలను కొనియాడారు.

 

అటు చిరంజీవి సైతం కైకాల సత్యనారాయణ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నటులు రాంచరణ్, నాని, రాజకీయ నేతలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితరులు తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

- Advertisement -