జెట్ స్పీడ్‌ మీదున్న కాజల్..!

319
kagal
- Advertisement -

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో జెట్‌ స్పీడు మీదుంది కాజల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య,కమల్‌తో భారతీయుడు,నాగార్జునతో సినిమాలో నటిస్తున్న కాజల్‌ తాజాగా మరో సినిమాకు పచ్చజెండా ఉపింది.

‘ఉమ’ టైటిల్​తో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. ఈ సినిమాతో తతగట సింఘా దర్శకుడిగా పరిచయమవుతుండగా.. సుజయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. కాగా పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది కాజల్.

- Advertisement -