పుష్పకు విలన్ ఫిక్సయ్యాడు..!

46
Fahad_Fazil

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతుండగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తికాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విలన్‌గా వస్తున్నారని వార్తలు రాగా అవన్నీ రూమర్స్‌ అని తేలిపోయింది. బన్నీకి విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌ నటించనున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి, సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట ఫహద్. లాక్ డౌన్ సమయాన్ని ముఖ్యంగా తెలుగు నేర్చుకోవడం కోసమే వినియోగిస్తున్నాడట. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది.