కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు:కడియం

12
- Advertisement -

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోఇంచారు కడియం శ్రీహరి. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,పల్లా రాజేశ్వర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్, సంజయ్, మానిక్ రావు ,చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ జాతిపిత గా పేరుగాంచి తెలంగాణ ను రోల్ మాడల్ గా నిలిపిన కేసీఆర్ ని ప్రతి సందర్బంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీన్ని తీవ్రంగ ఖండిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అజెండా లో లేని కాళేశ్వరం ప్రాజెక్ట్ మెడిగడ్డ పర్యటన పై మాట్లాడుతూ కేసీఆర్ మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నారు. స్పీకర్ మాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు….పదేపదే మైక్ కావాలని అడిగిన మాకు మైక్ ఇవ్వడం లేదు అన్నారు.

అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మీడియా పాయింట్ కి ప్రజలకు వెళ్లి చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు అన్నారు. అసెంబ్లీ నడుస్తున్నదని మమ్మల్ని అడ్డుకున్నారు..అసెంబ్లీలో మమ్మల్ని అడ్డుకునేందుకు కంచెలు వేశారన్నారు. ప్రజాస్వామ్యము గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని…సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసభ్యకర మాటలను రికార్డ్ నుండి తోలగించాలని ఆడిగాం మాకు మైక్ ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ 6 గ్యారెంటీలు బడ్జెట్ లో చెప్పిన లెక్కలు మోసపురితమైనవని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేశామన్నారు. మమ్మల్ని అడ్డుకునేందుకే సీఎం అసెంబ్లీకి వచ్చారు…మా నాయకున్నీ ,నన్ను అసభ్యకరంగా మాట్లాడారన్నారు. బడ్జెట్ పై చర్చ లో మమ్మల్ని ఉండకుండా చేశారు…మేం అసెంబ్లీలో ఉంటే హామీలపై నిలదిస్తారని ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాళేశ్వరం పైకి చర్చ డైవర్ట్ చేశారని తెలిపారు.

Also Read:మిస్టర్ బచ్చన్…వాలెంటైన్స్ డే

- Advertisement -