Kadiyam:దళితబంధుపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి?

26
- Advertisement -

కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల పైన విశ్లేషణ చేసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అందులో భాగంగా ఈరోజు వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ర్వహించామన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఉన్న 7 అసెంబ్లీ నియోజవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు ఎంపిటిసిలు పాల్గొన్నారన్నారు. పార్టీ బలంగానే ఉన్నది, చిన్న చిన్న పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయాం అన్నారు.

10 యేండ్లు అధికారంలో ఉండి పార్టినీ పట్టించుకోలేదనీ ఈరోజు కొందరు ప్రస్తావనకు తెచ్చారు…ఉద్యమ సమయంలో ఉన్న వారికీ పదవులు ఇవ్వలేదని మరీ కొందరు ప్రస్తావనకు తెచ్చారన్నారు. అన్నిటినీ సమీక్ష చేసుకుంటున్నాము.జిల్లా పార్టీ కార్యలయంను అనునిత్యం పట్టించుకునే విధంగా అక్కడే సమీక్ష సమావేశాలు చేసుకోవాలలన్నారు. ఇప్పటి నుండీ జిల్లా పార్టీ కార్యాలయం నుండీ పటిష్ఠంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

యునివర్సిటీలో విద్యార్థి సంఘాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటామని,రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. అమలు కానీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందిని…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలి, బిఆర్ఎస్ పార్టీ అదే డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చారు ప్రజలను మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారని…వాటిని అమలు చెయ్యమని బిఆర్ఎస్ పార్టీగా ప్రజల వైపు నుండీ మాట్లాడుతున్నామన్నారు.

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,నేను ఇద్దరం దళితులమే…దళిత బంధు అనే పథకం అమలు చేస్తాం అని ఒక స్పష్టమైన ప్రకటన బట్టి ఇవ్వడం లేదన్నారు. దళిత బంధు పైన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పడం లేదని…గృహ లక్ష్మీ ద్వారా కొంత మంది పేద ప్రజలు పునాది వేసుకోని గోడలు కట్టుకున్నారన్నారు. గృహ లక్ష్మీ పథకం పై స్పష్టమైన హామీ ఇవ్వకుండా లబ్దిదారులను అయోమయంలో పడేశారన్నారు.

Also Read:జాన్వీ కపూర్ పారితోషికం ఎంతంటే?

- Advertisement -