బీజేపీకి షాక్‌.. టీఆర్ఎస్‌లోకి అంజయ్య యాదవ్..?

214
Kadari Anjaiah Yadav
- Advertisement -

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ,టీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే బీజేపీకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో కమలనాథులకు కంగుతిన్నట్లైంది. సాగర్ ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా… చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది.

దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరి కొద్దిసేపటిలో అంజయ్య యాదవ్‌ ఫామ్ హౌస్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

- Advertisement -