కాలా..వసూళ్లు ఎంతో తెలుసా..!

351
rajani kaala
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కాలా. రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది.

చెన్నైలో రజనీ హవాకు ఎదురులేకుండా పోయింది. తొలిరోజు ఏకంగా 17 కోట్లకు పైగా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు,కేరళలో రూ. 3 కోట్లు,ఇతర రాష్ట్రాల్లో రూ. 6 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ కాలా హవా కొనసాగింది.

ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మొద‌టి రోజు ఈ చిత్రం చెన్నైలో రూ.1.76 కోట్ల గ్రాస్ రాబట్టి గతంలో విజయ్ సినిమా ‘మెర్సల్’ పేరు మీదున్న రూ.1.52 కోట్ల రికార్డుని అధిగమించింది. అయితే ‘కాలా’ సినిమా ‘కబాలి’ ఓపెనింగ్స్‌ను మించలేకపోయింది. ‘కబాలి’ తొలిరోజున మొత్తం రూ.87.5 కోట్లు వసూలు చేసింది.

- Advertisement -