‘రావ‌ణాసుర‌న్ గా’ ఎన్టీఆర్…

538
jailavakusa
- Advertisement -

ఎన్టీఆర్ న‌టించిన జైలవ కుశ సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో మ‌నకు తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈసినిమాకు మంచి స్పంద‌న రావ‌డ‌మే కాకుండా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. జైల‌వ కుశ అని ముడు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసినిమాకు బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా..ఎన్టీఆర్ అన్న క‌ళ్యాణ్ రామ్ ప్రోడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.

jai_ntr_kusa

జైలవ కుశ చిత్రం పోయిన సంవత్స‌రం సెప్టెంబ‌ర్ లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఎన్టీఆర్ న‌టించిన రావ‌ణ‌పాత్ర‌కు మాత్రం మంచి రెస్పాన్స వ‌చ్చింది. ఈపాత్ర‌కి సంబంధించిన సాంగ్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. అందువ‌ల్ల రావ‌ణా పాత్ర‌ను హైలెట్ చేస్తూ ఈసినిమాను మ‌ల‌యాళంలో రావ‌ణాసుర‌న్ పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు.

గ‌తంలో ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్ సినిమా కూడా తెలుగు లో భారీ విజ‌యాన్ని అందుకుంది. ఇందుకుగాను ఆ సినిమాను మ‌ల‌యాళంలో కూడా విడుద‌ల చేశారు. దేశ వ్యాప్తంగా ఈసినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. మ‌ల‌యాళంలో కూడా ఈసినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో అదే సెంటిమెంట్ తో జైల‌వ‌కుశ సినిమాను కూడా అక్క‌డ రిలీజ్ చేయ‌నున్నారు. మ‌ల‌యాళంలో జైల‌వ‌కుశ సినిమా ప్రోడ్యూస‌ర్ క‌ళ్యాణ్ రామ్ కు ఏమేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -