- Advertisement -
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేశానని తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గత మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థన చేశానని తెలిపారు. డాక్టర్స్, నర్సులు ఎంతో మంచి సేవలు అందించారన్నారు. కేటీఆర్ కూడా చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడారని..జీవితంలో ఏది జరిగినా మన మంచికే జరుగుతుందన్నారు.
కేటీఆర్ నీ మొదటిసారి కలిశానని..పాలిటిక్స్ వేరు… వ్యక్తిగతం వేరు అన్నారు. రేవంత్ రెడ్డి రావడం పరామర్శించడం… చాలా మంచి పరిణామం అన్నారు
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సీఎం రేవంత్, మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి, ప్రకాశ్ రాజ్, మంత్రులు కోమటిరెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.
Also Read:వైసీపీలో జగన్ టార్గెట్ అయ్యారా?
- Advertisement -