ఓట్లన్నీ నాకే పడ్డాయి.. కానీ వైసీపీదే గెలుపు-కేఏ పాల్‌

241
KA Paul
- Advertisement -

‘నేనే సీఎం అవుతాను.. ఆంధ్రాను అమెరికా చేస్తాను.. నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తాను’.. ఇలాంటి మాటలు ఎవరు చెబుతారో మీకు తెలిసే వుంటుంది. ఆయన మరెవరో కాదు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ తరఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తొలుత నుంచి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన మునుపు వున్న జోష్‌ను కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. బోలెడన్ని నవ్వులు కురిపించిన ఆయన ఓ సందర్భంలో కన్నీరు కూడా కార్చారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడిన అది పెద్ద సంచలనం అయ్యాయి.

తాజగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసాపురం లోక్ సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ, ఈవీఎంలలో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేఏ పాల్ ఆరోపించారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు. అవినీతిపై పోరాడేందుకు యువత తనతో కలిసి రావాలని, యువత తన వెంట వస్తే దీక్ష చేపడతానని పిలుపు నిచ్చారు.

- Advertisement -