“హలో గురు ప్రేమ కోసమే” మూవీపై కేటీఆర్ ప్రశంసలు

288
- Advertisement -

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా.. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ తండ్రిగా ప్రకాష్ నటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంత్రి కేటీఆర్ స్పందించారు. “హలో గురు ప్రేమ కోసమే” సినిమా పూర్తి వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రమని ట్వట్టర్ వేదికగా ప్రశంసించారు. ఎన్నికల సమయంలో చాలా బీజీగా ఉన్న కేటీఆర్.. పండుగ సందర్బంగా కాస్త విరామం దొరికిందని.. ఈ నేపథ్యంలో “హలో గురు ప్రేమ కోసమే” మూవీ చూసే అవకాశం వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.

ఇక మంత్రి కేటీఆర్ ట్వీట్ స్పందించిన రామ్, అనుపమ… ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. “ధన్యవాదాలండీ.. మీరు, మీ కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉందని రామ్ చెప్పగా.. “కృతజ్ఞతలు సర్” అంటూ అమపమ పోస్ట్ చేసింది.

- Advertisement -