డిసెంబరు 25న సోలో బ్రతుకే సో బెటర్‌..

216
- Advertisement -

టాలీవుడ్‌ సుప్రీం హీరో సాయితేజ్, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్.సుబ్బు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్‌ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని సమాచారం. అది కూడా థియేటర్లలో రిలీజవుతోంది. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తోంది. ఈ మేరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి.

దీనిపై హీరో సాయితేజ్ ట్వీట్ చేస్తూ, థియేటర్లలో ఆడియన్స్ ఈలలు, చప్పట్లు వినేందుకు ఆగలేకపోతున్నానని పేర్కొన్నారు. కొత్త పరిస్థితుల నడుమ థియేటర్లలో వస్తున్న తన చిత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు సమీపంలోని థియేటర్లలోకి వస్తోంది అంటూ వెల్లడించారు.

- Advertisement -