ఇంటి నుండే జ్యోతిరావు పూలేకు నివాళి: కొప్పుల

118
minister koppula

కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. రేపు (11.04.2020) మహాత్మా జ్యోతిబాపూలే జన్మదినం సందర్భంగా ప్రజలందరూ ఇంటి వద్ద నుండే ఆ మహానుభావునికి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

బడుగుల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు అహర్నిశలూ కృషి చేసిన ఆ మహానుభావునికి బహిరంగంగా ఎక్కువమంది గుమిగూడి నివాళులు అర్పించడం అంత శ్రేయస్కరం కాదన్నారు.

ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటి నుండి బయటకు రాకుండా ఇంటివద్ద నివాళులు అర్పించాలని… రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. లాక్ డౌన్ పర్యవేక్షిస్తున్న పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.