నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తలసాని..

106
talasani

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరిని పట్టి పీడిస్తూ భయకంపితుల్ని చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆధ్వర్యంలో వెంగల్ రావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ పార్క్ వద్ద పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ సిబ్బంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా మహమ్మరి వల్ల దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మొదటి రోజు నుండి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారుని వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు దీనిపై సమీక్ష నిర్వహిస్తూ మన దగ్గర వైరస్ ప్రబలకుండా పకడ్బందీ చర్యలకు అదేశిస్తున్నారని చెప్పిన తలసాని ….ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న సూచనలు ప్రజలు పాటిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ ,జీహెచ్‌ఎంసీ,వాటర్ వర్క్స్ ,ఫైర్ సిబ్బంది అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పారు. మన దగ్గర కేసులు చాలా తక్కువ అందరూ కొలుకుంటున్నారని వెల్లడించారు.