సినిమాలకు తగ్గ పాత్రలు చాలా ఉంటాయి. మరి ఆ పాత్రలకు అనుగుణంగా హావభావాలకు మాటలు పలకాలంటే మనం అనుకున్నంత తేలికేమికాదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. భరువెక్కిన హృదయంలోనైనా, కన్నీళ్లు పెట్టించే పాత్రలోనైనా ఒదిగిపోయి పాత్రలకు మాటలు అందించడం అంటే చాలా కష్టమైన పనే అని చెప్పాలి. తాజాగా మనముందుకొచ్చిన రంగస్థలం సినిమాలోని రామలక్ష్మీ పాత్రకు అచ్చం సమంత చెప్పిన వారెవరో కాదు మన జ్యోతివర్మ. గతంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలైనా వేదం, కంచె లాంటి చిత్రాలకు మాటలను అందించింది జ్యోతివర్మ. తన డబ్బింగ్ మ్యాజిక్ తో ప్రేక్షకులను మంత్రముగ్దల్ని చేసిన ఆమె గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
జ్యోతివర్మ పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో జన్మింది. నాన్న దిలీప్ వర్మ, అమ్మ శారద మహేశ్వరి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. 10వ తరగతి వరకు ఇక్కాడే నా చదువు కొనాసాగింది ఆనంతరం నాన్న ఉద్యోగ రిత్య కొన్నాళ్లు నాగ్‌పూర్ లో ఉన్నాం. కానీ మాకు అక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ వచ్చేశాం. తదనంతరం ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లోనే పూర్తయింది. మా ఇంటి వాతావరణంలో ఉన్న పరిస్థితులే నన్ను సినిమా రంగం వైపు నడిపించింది.
మా మేనమామ కేవీవీ సత్యనారాయణ సినీ నిర్మాణ విభాగంలో బాధ్యలు చేపట్టేవారు. సౌదామిని క్రియేషన్స్ పేరుతో ‘సుందరకాండ’, ‘కొండపల్లి రాజా’, ‘ఉమ్మడి మొగుడు’… వంటి సినిమాలన్ని ఆయన నిర్మాణంలో వచ్చినవే. మేము హైదరాబాద్ వచ్చాకా నాన్న ఆయన నిర్మాణ సంస్థలో క్యాషియర్ గా పని చేశారు. అలా పనిచేయటం వల్ల మా ఇంట్లో సినిమా ముచ్చుట్లు నా చెవులకు తాకేవి. దాంతో నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. మొదటగా ఇంటర్ పూర్తయ్యాక యాంకరింగ్ చేసి, తర్వాత నటనవైపు వెళ్దామనే ఆలోచనలో ఉండేదాన్ని. అలా రెండు టీవీ ఛానెళ్లలో యాంకిరింగ్ అవకాశం వచ్చింది.
మా నాన్న ఫ్రెండ్ జగదీష్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసేవాడు. ఒక రోజు నాన్నకు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడా నీ గొంతు బాగుంది డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా అన్నాడు. ఆయన చెప్పేదాక తెలియదు నాకు నాకు ఇలాంటి విభాగం ఉంటుందని ఇదే విషయం ఆయనతో చెప్పా. ఒకనాడు వాయిస్ టస్ట్ జరుగుతుందని వెళ్లి పరిక్షించుకోమన్నారు.
నేను నాన్నతో కలిసి వాయిస్ డబ్బింగ్ అసోసియేషన్ వెళ్లా. వేళ్లే సరికి పేపర్లు పట్టుకుని అక్కడ దాదాపు 60 మంది చదువుతున్నారు. అది నాకు ఇంకా గుర్తుంది. నాకు కూడా ఓ పేపర్ ఇచ్చి చదవమన్నారు. అంతే చదివి వదిలేశా. సరిగ్గా వారం తిరిగే సరికి ఫోన్ వచ్చింది నేను ఎంపికయ్యానని. వాయిస్ డబ్బింగ్ కు ఎంపికయ్యావు అనగానే నేను ఆశ్చర్యానికి గురై ఆనందంతో గంతేసి పలకరించిన అవకాశాన్ని పరీక్షించుకున్నా.
ఇలా నా సినిమా ప్రస్థానంలో ఎక్కువ కష్టపడకుండానే అవకాశం నాకు సంతోషానిచ్చింది. అక్కడికి వెళ్లాకా తెలిసింది ఈ విభాగం ఇంతమందికి ఉపాధినిస్తుందా అని. ఇష్టపడి చేయటంతో నాకు ఆ పని అంతా కష్టమనిపించలేదు. తోటివారు చెప్ప డబ్బింగ్ విధానం నాన్ను ఆకట్టుకుంది. అలా… ‘సూపర్’, ‘తులసి’, ‘సైనికుడు’ చెప్పడం. ‘స్టాలిన్’, ‘లక్ష్మీకల్యాణం’, ‘అన్నవరం’ వంటి ఇలా ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో సీరియల్ లో చేసే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నా. ఈటీవీ, జెమినీ, జీతెలుగు ఇలా నాయిక, ప్రతినాయిక పాత్రలకు చెప్పడంతో తీరికలేకుండా పోయింది.
2011లో వచ్చిన ‘పసుపుకుంకుమ ’ సీరియల్‌కి నంది అవార్డును సైతం అందుకున్నా. క్రమంగా వరుస ఆఫర్లు క్యూకట్టడంతో హీరోయిన్లకు చెప్పే స్థాయికీ నేను వెళ్లా. ఈ క్రమంలో వేదం లాంటి సినిమాకు చేశా. ఆ సినిమాకు వాయిస్ డబ్బింగ్ చెప్పడంతో ఒక వైపు కొందరు ప్రశంసలు కురిపించినా..మరొ వైపు ఆఫర్లు రాకపోవడం చాలా బాధేసింది. ఒక పాత్రను బట్టి, సన్నివేశానికి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఇ సినిమాకు ఐదుసార్లు టేకులు తీసుకున్నసందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా వచ్చిన రంగస్థలం సినిమా అవకాశం రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మొదటగా ఈ మూవీకి డబ్బింగ్ చెప్పటానికి చాలా మంది పోటీలో ఉన్నారు. కాకపోతే సమంత పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పకుంటున్నారన్న వార్తలు కూడా వినపించాయి. కానీ తీరా చూస్తే ఆ అవకాశం నన్ను వెతెక్కుంటూ వచ్చింది. మొదటగా ఈ సినిమాకు ట్రాక్ మాత్రం చెప్పమన్నారు. కానీ సినిమా మొత్తానికి చెప్పే అవకాశం రావటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ప్రథమార్థంలో ‘‘ఆడోళ్లు తానం చేత్తంటే తలుపు తీయడానికి నీకేం పోయేకాలం’’ అని తిట్టడం… సందర్భాన్ని బట్టీ హైపిచ్, లోపిచ్‌లో మాట్లాడటం నాకు సవాలుగా మారిందని చెప్పాలి.