ప్రజల్లో మనపై కొంత నమ్మకం వస్తే చాలు అందరు రాజకీయాల వైపు మొగ్గు చూపుతారు. ఏదో ఒక రాజకీయపార్టీ జెండ పట్టుకుని సేవ చేస్తామంటూ మాయ మాటలు చెబుతారు. గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఆమాడ దూరంలో ఉంటారు. ఇది నేటితరం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వారి పరిస్థితి. అయితే ఇలా కొంత మంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మంచి పనులు చేసి ప్రజల గుండెలో నిలిచిపోయినవారు కూడా ఉన్నారు.
ఇటీవలే కాలంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి నటీనటులు, క్రీడాకారులు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా….నందమూరి నటసింహా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా చెబుతూ పోతే రాజకీయాలోకి వచ్చి పాస్ అయినవారు ఉన్నారు…. అట్టార్ ప్లాప్ అయ్యిన స్టార్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందట.
క్రీడాకారిణిగా ఆమె ఎంత ఫేమస్సో.. ఆటలోని రాజకీయాల్లోనూ ఆమె అంతే ఫేమస్ అయ్యింది గుత్తా జ్వాల. నిత్యం తన కోచ్ గోపీచంద్‌ను తిడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది గుత్తా. తొలినాళ్లలో ఆటలో రాకెట్‌లా దూసుకుపోయిన ఆమె.. తర్వాత వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ప్రస్తుతం అటు ఆటలో విబేదాలు, ఇటు ఫామ్ కోల్పోవడం వంటి అంశాలతో ఆమె.. విసిగిపోయిందట ఈ క్రీడాకారిని.
గుత్తాజ్వాల తన పొలిటికల్ ఎంట్రీపై పలు రాజకీయాపార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతుందట. అంతేగాక ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏ పార్టీనుంచి పోటీ చేయాలి అనే దానిపై కూడా ఆలోచనల పడిందట. తను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎలక్షన్స్ 2019లో ఎంపీగా పోటీ చేసే అవకాశముందని సమాచారం. దీంతో గుత్తాజ్వాల ఆటకు గుడ్ బై చెప్పి రాజకీయా సేవ చేయాలని డిసైండ్ అయ్యినట్లు తెలుస్తోంది.
గుత్తాజ్వాల పొలీటికల్ ఎంట్రీపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజిక సేవ చేయాలి అనుకుంటే క్రీడాకారిణిగా ఉంటూ కూడా సేవచేయవచ్చు కదా అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.