సర్పంచ్ నుండి మంత్రిగా జువ్వాడి రాజకీయ ప్రస్ధానం..

368
juvvadi ratnakar rao
- Advertisement -

మాజీ మంత్రి,తెలంగాణ పోరాట యోధుడు జువ్వాడి రత్నాకర్ రావు(92) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

రత్నాకర్ రావు స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్. ఆయన మృతితో బంధువులు, సన్నిహితులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

12 సంవత్సరాలు పాటు సర్పంచిగా, ఓసారి పంచాయితీ ప్రెసిడెంట్ గా పనిచేసిన రత్నాకర్ రావు బుగ్గారం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఓసారి ఇండిపెండెంట్ గా, మరో రెండు సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వై.ఎస్. హయాంలో 2007- 2009 వరకు దేవాదాయ, స్ట్రాంప్స్ అండ్ రిజిస్ట్రేన్ల మంత్రిగా పనిచేసిన జువ్వాడి ధర్మపురి ఆలయ తొలి పాలక మండలి ఛైర్మన్ గా పనిచేశారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి .ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -