- Advertisement -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేశారు.రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్…ఎన్వీ రమణ చేత ప్రమాణస్వీకారం చేయించారు. 2022, ఆగస్టు 26వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కొవిడ్ దృష్ట్యా కొద్దిమంది అతిథుల సమక్షంలోనే జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రమణ.ఆయన పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగుస్తుంది. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబర్ 1 వరకు ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పని చేశారు.
- Advertisement -