ఏపీలో నైట్ కర్ఫ్యూ…టైమింగ్స్ ఇవే

133
night curfew
- Advertisement -

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుండగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.

అత్యవసర సర్వీసులు మినహా..మిగతా అన్నీటిని రాత్రి 10 గంటలకే క్లోజ్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఏపీ ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో 18–45 వయసున్న వారికి ఉచితంగా టీకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2,04,70,364 మంది ఉన్నారని..మే 1 నుంచి వీరికి వ్యాక్సిన్ అందించనుంది.

- Advertisement -