- Advertisement -
జురాలకు జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జురాలకు భారీగా వరదనీరు చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో 13 గేట్లను ఎత్తినీటిని దిగువకు విడుదల చేశారు.
శుక్రవారం ఉదయానికి లక్షా 18 క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉండటంతో లక్షా 21 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు (9.657) టీఎంసీలు కాగా ప్రస్తుతం 1044 అడుగులు (8.810 టీఎంసీలు)గా ఉంది.
- Advertisement -