దేశంలో 53 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

183
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 53 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంట‌ల్లో 96,424 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1174 మంది మృత్యువాతపడ్డారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 52,14,678కు చేరగా 10,17,754 యాక్టివ్ కేసులున్నాయి. 41,12,552 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 84,372 మంది మృతిచెందారు.

దేశ‌వ్యాప్తంగా 24 గంటల్లో 10,06,615 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా సెప్టెంబ‌ర్ 17 నాటికి 6,15,72,343 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.