గత కొద్ది రోజులుగా నందమూరి ఫ్యామిలీలో గొడవలు ఉన్న విషయం తెలిసిందే. ఇటివలే హరికృష్ణ మరణం తర్వాత వారందరూ ఒక్కటైపోయారు. హరికృష్ణ మరణించిన తర్వాత నందమూరి ఫ్యామిలీలో ఉన్న గొడవలు తొలగిపోయాయి. ఆమద్య ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య పాల్గొనగా తాజాగా జరిగిన ‘ఎన్టీఆర్’ ఆడియో విడుదల కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించి అలరించాడు.
దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం జైపూర్ లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి చాలా మంది టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. కార్తికేయ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఎన్టీఆర్ మరియు ఇతర స్టార్స్ ఎంజాయ్ చేశారు. సంగీత్ లో జరిగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడ ఉన్న కొంత మంది జై బాలయ్య అని అరవగా అక్కడే ఉన్న ఎన్టీఆర్ కూడా గట్టిగా జై బాలయ్య అంటూ అరిచాడు. దింతో అక్కడున్న సెలబ్రెటీలు అఖిల్, జగపతి బాబు పలువురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ నోట జై బాలయ్య అనే పదం రావడంతో నందమూరి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.