గుణ‌శేఖ‌ర్,రాణా ‘హిర‌ణ్య‌క‌శ‌ప‌’

370
rana gunashekar
- Advertisement -

మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందిస్తున్న దర్శకుడు గుణశేఖర్ ఈ సారి ” హిరణ్యకశిప “అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. ఈ సినిమాలో బాహుబలి ఫేమ్ రానా హీరోగా నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

gunasekhar

ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. విజువల్ వండ‌ర్‌లా ఈ సినిమాని తీర్చిదిద్దేందుకు గుణశేఖర్ భారీ కసరత్తులు చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ తో ఈ సినిమాకి అవసరమైన రాజప్రాసాదాలు,మంటపాలు ,దేవలోకం,వైకుంఠం,ఉద్యానవనాలు వంటి సెట్స్ ను వేయిస్తున్నారట.

- Advertisement -