సైబర్‌ నేరగాళ్ల వలలో పడకండి: ఎన్టీఆర్

183
jr ntr

రోజురోజుకు ఆన్ లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వందల సంఖ్యలో బాధితులు మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు వారి నుండి వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారు.

దీంతో సైబర్ మోసాలపై మరింత అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక వీడియోని రూపొందించారు. ఎన్టీఆర్‌తో రూపొందించిన ఈ వీడియోలో సోషల్ మీడియా ద్వారా ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి ద్వారా మ‌హిళ ఎంత మాన‌సిక క్షోభ అనుభ‌విస్తుందో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

ఇలాంటి మోసాల‌లో చిక్కుకోకుండా ఉండేందుకు యువ‌త త‌గినన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని తెలిపిన ఎన్టీఆర్……వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు..జాగ్రత్త అంటూ విజ్ఞప్తి చేశారు.