జూన్‌ 21..తెలంగాణ చరిత్రలో సువర్ణఅధ్యాయం:కేటీఆర్

406
ktr kaleshwaram
- Advertisement -

జూన్ 21 తెలంగాణ చరిత్రలో సువర్ణఅధ్యాయమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్‌ రాసిన వార్తలను షేర్ చేసిన కేటీఆర్ దేశ చరిత్రలో ఓ కొత్త రాష్ట్రం అద్భుతాన్ని సృష్టించిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను కేవలం 3 సంవత్సరాల టైంలోనే పూర్తిచేసి రికార్డు సృష్టించిందన్నారు.

ఇకపై వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే రైతన్నలకు వరప్రదయినిగా తెలంగాణకు జీవధారగా మారనుంది కాళేశ్వరం. నదికే నీళ్ళనిచ్చే జీవనదిగా మారనుంది కాళేశ్వరం . 1832 కిలోమీటర్‌ల పొడవునా, 190 టీఎంసీల గోదావరి జలాలను ఎతిు పోస్తూ … 20 జిల్లాలకు ఉపయోగపడే లా డిజైన్ అయి 45లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు.

సాగునీటి చరిత్రలోనే ఒక మహా అద్భుతాన్నిఆవిష్కరించబోతున్న తరుణం కోసం యావత్ భారత్‌ ఎదురుచూస్తోంది. ఇక ఏ కాలమైనా రైతులు వర్షాల కోసం నింగిని చూసే పనిలేదు. తెలంగాణ గ్రామీణ సంక్షభాన్ని పారదోలి వ్యవసాయాన్ని పండగలా మార్చే వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ అపరభగీరథుడిలా మారారు.

- Advertisement -