సీఎంఆర్‌ఎఫ్‌కు జూబిలీహిల్స్ సొసైటీ భారీ విరాళం..

417
kcr

కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఇందులో జూబిలిహిల్స్ సొసైటీ కోటి రూపాయలు, జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ రూ.50 లక్షల విరాళం అందించింది.

దీనికి సంబంధించిన చెక్కులను సొసైటీ అధ్యక్షుడు టి.నరేంద్ర చౌదరి,కార్యదర్శి టి.హనుమంతరావు, కోశాధికారి ఎ.సురేశ్ రెడ్డి ప్రగతిభవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు.