రేపు జాతినుద్దేశించి ప్రసగించనున్న మోడీ…

299
modi

కరోనాను అరికట్టేందకు భారత ప్రభుత్వం విధించిన తొలి విడత లాక్ డౌన్‌ ఏప్రిల్ 14(రేపటి)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగింపుపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది కేంద్రం.

రాష్ట్రాల వారీగా వివరాలు,లాక్ డౌన్ కొనసాగింపుపై మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసగించనున్నారు ప్రధాని.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో లాక్ డౌన్‌ని కొనసాగించేందుకే మోడీ మొగ్గుచూపనున్నారు. ఇప్పటికే ఒడిశా, పంజాబ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించాయి.