బాలానగర్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన కేటీఆర్‌..

530
ktr inspection

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈ రోజు తనిఖీ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ట్రాఫిక్ తక్కువగా ఉండటం, సామగ్రి రవాణాకు వీలుండడం వంటి అనుకూల అంశాలను ఉపయోగించుకొని రోడ్డు మరియు ఇతర మౌలిక వసతుల ( ఇన్ ఫ్రా) పనులను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

దీంతో పాటు అక్కడే నిర్మాణంలో ఉన్న నాలా విస్తరణ, రోడ్డు విస్తరణ వంటి పనుల పురోగతి కూడా జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రానున్న రెండు వారాల్లో పెద్ద ఎత్తున ఈ పనులు కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో పౌరులకు తక్కువ అసౌకర్యం కలుగుతుందని, ఈ లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. మంత్రి వెంట హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీకి చెందిన ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు.

ktr inspection