బిగ్‌బాస్‌.. డిసైడ్ చేస్తాడట !

192
Jr NTR's Bigg Boss is No. 1
Jr NTR's Bigg Boss is No. 1
- Advertisement -

వెండితెర‌పై ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల బిగ్ బాస్ షోతో బుల్లితెర‌లో బిగ్‌బాస్‌గా సందడి చేస్తున్నాడు. తెలుగు టీవీ చరిత్రలో గ‌తంలో ఏ రియాలిటీ షో కి కూడా ఇంత రేటింగ్ రాలేద‌ని అంటున్నారు. తాజాగా వెల్లడించిన గత వారం టీఆర్పీ రేటింగ్స్‌లో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో స్టార్ మా ఛానెల్‌ని మళ్లీ ఫామ్‌లోకి వచ్చేలా చేసిందట. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు లాంచింగ్ ఎపిసోడ్ 16.18 రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచి ఎన్టీఆర్‌కి వున్న క్రేజ్ ఏంటో నిరూపించాయనేది ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. మిగ‌తా రోజుల కంటే ఎన్టీఆర్ క‌నిపించే రోజుల‌లో ఈ షోని చాలా మంది వీక్షిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

బిగ్‌బాస్‌ షోలో ఎన్టీఆర్ కంటెస్టంట్లను నొప్పించకుండా విమర్శలు చేస్తూ.. బిగ్ బాస్ తెలుగు వెర్షన్‌ను మరింత ఆసక్తికరంగా చేస్తుండగా, కంటెస్టంట్లు మాత్రం గత వారం నుండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో విఫలమయ్యారు. ఇదిలా ఉండగా ఈ స్టార్ హీరో షో ప్రారంభంలో చేసిన యాంకరింగ్ ఆర్టీఫియల్‌గా ఉందంటూ కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్‌ కొన్ని మార్పులు చేసుకున్నాడట.

షో మొదటి వారంలో ఎన్టీఆర్‌కు స్క్రిప్ట్ రాసివ్వడంతో యాంకరింగ్ కొంత ఆర్టీఫిషియల్‌గా కనిపించింది. అయితే రెండవ వారంలో ఎన్టీఆర్ ఆ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టాడట.. కేవలం తన టైమింగ్‌తో.. పంచులతో సెకెండ్ వీక్‌లో ఎంటర్‌టైన్ చేశాడట యంగ్ టైగర్. అంతేకాదు డైలాగులు రాసేందుకు తెచ్చుకున్న రైటర్‌ను కూడా ఎన్టీఆర్‌ పక్కన పెట్టాడట.. రైటర్‌ కేవలం బేసిక్ సమాచారం, సీన్లకు సంబంధించిన వివరాలు ఇస్తాడట. ఇక షోలో ఏం మాట్లాడలనేది ఎన్టీఆర్‌ డిసైడ్ చేస్తాడట. రానున్న రోజుల‌లో ఈ షో మ‌రింత ఇంట్రెస్టింగ్ గా మార‌నున్న నేప‌థ్యంలో ఎన్టీఆర్ బుల్లితెర‌పై కూడా రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉండ‌గా ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌నున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్, రాశి ఖ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

- Advertisement -